కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం లింగాల మండలంలోని కర్ణ పాపయ్యగారి పల్లె వద్ద విషాదం చోటు చేసుకుంది. చిన్న కుల్లాయప్ప అనే వ్యక్తి మరో ఇద్దరు స్నేహితులతో కలిసి గ్రామ సచివాలయ పరీక్ష రాసేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్లారు. పరీక్ష కేంద్రం నుంచి తిరిగి వస్తుండగా... కర్ణ పాపయ్య పల్లె వద్దకు రాగానే టైర్ పంచర్ కావటంతో ద్విచక్ర వాహనం బోల్తా కొట్టింది. ప్రమాదంలో చిన్న కుల్లాయప్ప మృతి చెందగా... మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పరీక్షకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం..వ్యక్తి మృతి - bike accident in kadapa district
గ్రామ సచివాలయ పరీక్ష రాసి వస్తున్న ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పరీక్ష రాసి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడగా మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
![పరీక్షకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం..వ్యక్తి మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4308332-520-4308332-1567358814028.jpg)
'ద్విచక్ర వాహన ప్రమాదంలో కడప జిల్లా వ్యక్తి మృతి'
'ద్విచక్ర వాహన ప్రమాదంలో కడప జిల్లా వ్యక్తి మృతి'
ఇది చూడండి: క్వారీలో ప్రమాదం..వాహనం కిందపడి కార్మికుడు మృతి