ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొనడం వల్ల యువకుడు మృతి చెందిన ఘటన కడప జిల్లా రైల్వేకోడూరులో జరిగింది. మృతి చెందిన వ్యక్తి కస్తూరి తేజ (18)గా పోలీసులు గుర్తించారు. మామిడికాయల యార్డు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లారీ టైరు కిందపడి చనిపోయాడని ఎస్సై వెంకటనరసింహం తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు వివరించారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి - kadapa district latest accident news
రైల్వేకోడూరు మామిడికాయల యార్డు వద్ద జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. లారీ కింద పడి చనిపోయాడని పోలీసులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
యువకుడి పాత చిత్రం