ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 13, 2020, 12:07 PM IST

ETV Bharat / state

స్వరాష్ట్రానికి పంపాలంటూ బీహార్ కూలీల ఆవేదన

తమను సొంత రాష్ట్రాలకు చేర్చాలంటూ.. బిహారకు చెందిన కూలీలు కమలాపురంలో అధికారులను వేడుకుంటున్నారు. డ్రైనేజీ కాంట్రాక్ట్​ పనులకోసం వచ్చి 34 మంది కూలీలు.. కడప జిల్లాలోనే లాక్ డౌన్ కారణంగా చిక్కుకుపోయారు.

bihar migrants locked in kamalapuram and urged officers to send back to their hometown
బిహార్​కు చెందిన కూలీలు

కడప జిల్లా కమలాపురం డ్రైనేజీ కాంట్రాక్టు పనుల నిమిత్తం బీహార్​కు చెందిన వలసకులీలు 34 రోజుల క్రితం జిల్లాకు వచ్చారు. లాక్​డౌన్​ కారణంగా తినేందుకు కూడా ఏమీ లేక.. ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందారు. పనులు చేసుకోవాలన్నా... కరోన భయంతో పోలేకపోతున్నామని అన్నారు.

బిహార్​లో ఉన్న తమ కుటుంబాల వద్దకు చేర్చాలంటూ.. ఆ 34 మంది వలస కూలీలు తహసీల్దార్​, పోలీసులను వేడుకున్నామని చెప్పారు. వారు 4 రోజుల్లో మిమ్మల్ని పంపడానికి పై అధికారులతో మాట్లాడతామని చెప్పారన్నారు. త్వరగా తమను బీహార్ కు పంపించాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details