ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడప జిల్లాలో భోగి మంటల సందడి - ఏపీలో సంక్రాంతి పండుగ

సంక్రాంతి సందర్భంగా తెలుగు లోగిళ్లలో భోగి మంటలు వేశారు. కడప జిల్లాలో తెల్లవారుజామునుంచే వేడుకలు మొదలయ్యాయి. ప్రజలంతా సంతోషంగా.. మంటల చుట్టూ ఆడిపాడారు.

bhogi fire at kadapa district
కడప జిల్లాలో భోగిమంటల సందడి

By

Published : Jan 13, 2021, 1:18 PM IST

కడప జిల్లాలో భోగిమంటల సందడి

కడపలో...

కడపలో భోగి పండుగను ప్రజలు ఎంతో సంతోషంగా చేసుకుంటున్నారు. తెల్లవారుజామునే లేచి భోగిమంటలు వేశారు. గడిచిన ఏడాది కరోనాతో అతలాకుతలమైన ప్రజా జీవనం కొత్త ఏడాదిలో మరింత బాగుండాలని కోరుతూ ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో భోగి పండుగను జరుపుకుంటున్నారు. స్థానికులు భోగి మంటలు వేసి నృత్యాలు చేస్తున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఆడిపాడారు.

మైదుకూరులో...

కడప జిల్లా మైదుకూరు ప్రాంతంలో తెల్లవారుజాము నుంచే భోగి మంటలు వేశారు. భోగి మంటల చుట్టూ యువకులు చేరి సందడి చేశారు. కరోనాతో వేడుకలకు దూరమైన ప్రజలు.. ఇప్పుడు సంక్రాంతితో ఉల్లాసంగా గడుపుతున్నారు.

ఇదీ చూడండి:

తెలుగు లోగిళ్లలో భోగి సందడి... ఆకట్టుకుంటున్న బొమ్మల కొలువులు

ABOUT THE AUTHOR

...view details