భారత్ బంద్ సందర్భంగా కడప జిల్లా జమ్మలమడుగులో వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక తాడిపత్రి రోడ్డులో సీపీఐ, సీపీఎం, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. జమ్మలమడుగు పాత బస్టాండ్‌లో బైఠాయించి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రైవేటీకరణపై ప్రధాని మోదీ తీసుకుంటున్న నిర్ణయాలన్ని ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
జమ్మలమడుగులో వామపక్ష పార్టీల ర్యాలీ - kadapa latest news
కడప జిల్లా జమ్మలమడుగులో వామపక్ష నాయకులు భారత్ బంద్‌ను నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ బంద్‌లో తెదేపా నేతలు కూడా పాల్గొన్నారు.
జమ్మలమడుగులో భారత్ బంద్