కుళాయి వద్ద గొంతు తడుపుకుంటున్న తేనెటీగలు - bhanudu-pratapam
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. జీవరాశులు సైతం నీటి కోసం అల్లాడుతున్నాయి. కడప జిల్లా బద్వేలు ఆర్టీసీ డిపోలో తేనెటీగలు కులాయి వద్ద నీటి కోసం గుంపులుగా చేరి గొంతు తడుపుకుంటున్నాయి.
thenateegalu
భానుడు రోజురోజుకు తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉన్నాడు. రాష్ట్రంలో గరిష్ట స్థాయి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో గొంతు తడుపుకునేందుకు మనుషులే కాదు...అనేక జీవరాశులు తల్లడిల్లుతున్నాయి. ప్రాణాలను కాపాడుకునేందుకు నీటి కోసం తేనెటీగలు కుళాయి వద్ద అవస్థలు పడుతున్నాయి. కడప జిల్లా బద్వేలు ఆర్టీసీ డిపోలో తేనెటీగలు కుళాయి వద్ద గుంపులుగా చేరి గొంతు తడుపుకుంటున్నాయి.
TAGGED:
bhanudu-pratapam