ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు అందించిన దాల్మియా సిమెంట్​ - corona cases at kadapa

దాల్మియా సిమెంట్​ భారత్‌ లిమిటెడ్‌ 30 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను వితరణ చేసింది. సంస్థ ప్రతినిధులు కడప జిల్లా కలెక్టర్ హరికిరణ్‌ చేతికి కాన్సన్‌ట్రేటర్లను అందించారు.

dhalmiya cement distributed oxygen concentrators
ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు అందించిన దాల్మియా సిమెంట్​

By

Published : Jun 5, 2021, 10:44 AM IST

కడప జిల్లాలో కొవిడ్​ బాధితులకు సాయంగా.. దాల్మియా సిమెంట్​ భారత్‌ లిమిటెడ్‌ 30 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను వితరణ చేసింది. శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌ హరికిరణ్‌ చేతికి రూ.37.31 లక్షల విలువ చేసే ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను అందించారు. జిల్లాలో కొవిడ్‌ రెండో దశను సమర్థమంతంగా ఎదుర్కొనేందుకు దాల్మియా సిమెంటు ప్రతినిధులు పది లీటర్ల సామర్థ్యం కల్గిన ఆక్సిజన్‌ యంత్రాలను అందించారని కలెక్టర్ అన్నారు. వారి దాతృత్వం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్‌ కార్తీక్‌, దాల్మియా సిమెంటు ప్రతినిధులు కరుణాకర్‌, నరేంద్ర పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details