కడప జిల్లా రాజుపాలెం మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి విలువలి గ్రామంలోని కొన్ని వీధుల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది .దీంతో గ్రామస్థులు ఇబ్బందులు ఎదుర్కంటున్నారని విషయం తెలుసుకున్న మండల అధికారులు అక్కడ పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం రోడ్లపై నీటిని జెసీబీ సహాయంతో కాలువలు తీసి వాటి ద్వారా గ్రామంలోని నీటిని బయటకు పంపించేలా చర్యలు చేపట్టారు.
విలువలిలో వీధుల్లోకి నీరు..అధికారుల చర్యలు - కడప జిల్లా రాజుపాలెం మండలంలో భారీవర్షాలు
రోజూ కురుస్తున్న భారీవర్షాలకు విలువలి గ్రామప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.వీరి ఇబ్బందులు గుర్తించిన అధికారులు చర్యలు చేపట్టారు.
kadapa viluvali villagerse are facing problems