కడప జిల్లాలోని కేసీ ఆయకట్టుకు సాగునీరు ఇవ్వడంతో కాలువల్లో జలకళ సంతరించుకుంది. జిల్లాలో కేసీ కాలువ ఆయకట్టు కింద 92 వేల ఎకరాలు ఉండగా ఇటీవలే సాగునీరు విడుదల చేయగా...కాలవలో ఉరకలెత్తే నీటి ప్రవాహాలు అందర్ని కనువిందు చేస్తున్నాయి. ఎగువ తూములకు నీరు అందేలా చేయటంతో కాలువలపై అక్కడక్కడ ఉన్న ఆనకట్టల వద్ద నీటి పరవళ్ళు నయాగరాను తలపిస్తున్నాయి. నీటి హొయల అందాలు ప్రత్యేక ఆకర్షణగమారాయి. పరవళ్లు తొక్కుతున్న నీటి దృశ్యాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.
నీటి పరవళ్లు..తలపిస్తున్న జ్ఞాపకాలు.. - కేసీ కాలువ ఆయకట్టు
ఉరకలెత్తే నీటి చూస్తే భలే సరదాగా... మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. పాల నురగలా పారే నీరు..పచ్చని పొలాల్లోకి జాలువారుతుంటే కనువిందు కలిగిస్తున్నాయి.
![నీటి పరవళ్లు..తలపిస్తున్న జ్ఞాపకాలు..](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4412402-114-4412402-1568258838411.jpg)
కనువిందు చేస్తున్న కేసీ కాలువ ఆయకట్టు నీరు..
Last Updated : Sep 12, 2019, 9:44 AM IST