బీసీలను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పార్టీ కార్యకర్తలుగా ఉపయోగించుకుంటున్నారని... బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రెడ్డయ్య బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు, ఛైర్మన్ల ఏర్పాటుతో ఎలాంటి ప్రయోజనం లేదని విమర్శించారు. వైకాపాకు బీసీలు వెన్నెముక అని చెప్పిన ముఖ్యమంత్రి జగన్... ఇప్పుడు వారిని పావులుగా ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. బీసీ డైరెక్టర్లు, ఛైర్మన్లకు ఇచ్చే వేల కోట్ల రూపాయలను బీసీ కార్పొరేషన్ ద్వారా రుణంగా ఇస్తే ప్రజలకు ఉపయోగపడుతుందని రెడ్డయ్యబాబు పేర్కొన్నారు.
'బీసీలను వైకాపా కార్యకర్తలుగా ఉపయోగించుకుంటున్నారు' - కడప నేటి వార్తలు
బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు, ఛైర్మన్ల ఏర్పాటుతో ఎలాంటి ప్రయోజనం లేదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రెడ్డయ్య బాబు విమర్శించారు. బీసీలను పార్టీ కార్యకర్తలుగా ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు.
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రెడ్డయ్య బాబు