బీసీ రైతు కూలీలకు 2ఎకరాల వ్యవసాయ భూమి ఇవ్వాలని బీసీ మహాసభ జాతీయ కన్వీనర్ మల్లికార్జున్ డిమాండ్ చేశారు. భూమిలేని నిరుపేద బీసీలకు భూమి ఇవ్వాలని కోరుతూ కడప కలెక్టరేట్ ఎదుట బీసీ మహాసభ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర జనాభాలో 55 శాతం బీసీలు చేతివృత్తుల కాకుండా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారని చెప్పారు. భూమి లేని బీసీలకు భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం భూ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని కోరారు. ప్రభుత్వం స్పందించకుంటే భూములను ఆక్రమించు కుంటామని హెచ్చరించారు.
కడప కలెక్టరేట్ ఎదుట బీసీల ధర్నా - కడప కలెక్టరేట్
కడప కలెక్టరేట్ ఎదుట బీసీ మహాసభ ధర్నా చేపట్టారు. బీసీ రైతు కూలీలకు 2 ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు.
కడప కలెక్టరేట్ ఎదుట బీసీల ధర్నా