ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెల్లవారుజామునే తెరుచుకున్న మద్యం దుకాణాలు.. పట్టించుకోని అధికారులు

BARS OPEN AT EARLY MORNING IN KADAPA: సహజంగా బార్​లు ఉదయం 10 గంటల తర్వాత ఓపెన్​ చేస్తారు. అంతగా తెరవాలంటే 8 గంటల తర్వాత చేస్తారు. కానీ ఇక్కడ మద్యం దుకాణాలు మాత్రం కోడి కూయక ముందే తెరిచి.. మందుబాబులను ఆహ్వానిస్తున్నారు. మరి నిబంధనలకు విరుద్ధంగా తెరుస్తుంటే.. అధికారులు ఏం చేస్తున్నారు అనే ప్రశ్న తలెత్తిందా? అయితే ఇది చదవండి.

BARS OPEN AT EARLY MORNING
BARS OPEN AT EARLY MORNING

By

Published : Jan 31, 2023, 12:03 PM IST

BAR OPEN AT EARLY MORNING : మందుబాబులు ఆత్రంగా ఎదురు చూసేది.. బార్​లు ఎప్పుడు తెరుస్తారా .. ఉదయం 10 గంటలూ ఎప్పుడవుతుందా అని. అయితే కోడి కూయక ముందే బార్​లు ఓపెన్​ చేస్తారని తెలిస్తే.. షాపుల ముందు క్యూ కట్టేస్తారు. అసలు తెల్లవారుజామున ఎందుకు తెరుస్తారు అని డౌట్​ వచ్చిందా. మీ డౌట్​కి క్లారిఫికేషన్​ ఇది చదివితే వస్తుంది.

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాక పులివెందులలో తెల్లవారుజామునే బార్​లు తెరుస్తున్నారు. నియోజకవర్గంలోని వేంపల్లె పట్టణంలో తెల్లవారుజామునే బార్​లో మద్యం అమ్మకాలు కొనసాగుతున్న అధికారులు పట్టించుకోకపోవడం పలు విమర్శలకు దారి తీస్తుంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తెల్లవారు జామునే బార్​లు ఓపెన్ చేస్తున్న ఎందుకు కళ్లు మూసుకుంటున్నారో అర్థం కావడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే షాపు యాజమాని.. ఎక్సైజ్ అధికారులను ప్రసన్నం చేసుకోవడం వల్లే మద్యం అమ్మకాల దందా కోడి కూయక ముందే నడుస్తుందనే ఆరోపణలు ఉన్నాయి.

ఈ ఆరోపణలు నిజం చేస్తూ వేంపల్లి పట్టణంలోని పులివెందుల రోడ్​లో ఉన్న బార్ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా మద్యం అమ్మకాలు జరుపుతున్నారు. ఇక నైనా ఎక్సైజ్ అధికారులు కళ్లు తెరిచి తెల్లవారుజామునే మద్యం అమ్మకాలు చేస్తున్న బార్​షాపులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మరి ఈ బార్ షాపుపై ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకుంటారా… లేక ప్రజల అనుమానాలను నిజం చేస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details