నాయీ బ్రాహ్మణులకు జగన్ సర్కారు రూ.10 వేలు ఇవ్వటాన్ని హర్షిస్తూ కడప కలెక్టరేట్లో నాయీ బ్రాహ్మణులు సీఎం జగన్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 90 శాతం అమలు పరిచిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. మరో పదేళ్ల వరకు ముఖ్యమంత్రిగా జగనే ఉంటారాని పేర్కొన్నారు.
జగన్ చిత్రపటానికి నాయీబ్రాహ్మణుల క్షీరాభిషేకం - కడప లో నాయీబ్రాహ్మణులకు ఆర్థికసాయం వార్త
లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్నారని మొన్న పాస్టర్లకు.. ఈరోజు నాయిబ్రాహ్మణులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి ఆదుకుంది. రూ.10 వేలు ఇచ్చినందుకు కృతజ్ఞతగా... కడప కలెక్టరేట్లో నాయీ బ్రాహ్మణులు సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు..
barbars thanks to cm jangan by giving finacila help to them due lockown issue