మందుబాబులు మండుటెండలను సైతం పట్టించుకోకుండా మద్యం కోసం బారులు తీరారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలు ఆన్లైన్ కాకపోవడం వల్ల కొన్ని చోట్లు ఆలస్యంగా అమ్మకాలు మొదలయ్యాయి. మరోవైపు... మద్యం విక్రయించేవారు మాస్కులు ధరించాలి, సామాజిక దూరం పాటించాలన్న నిబంధనలు ఉన్నప్పటికీ మందు బాబులు ఇవేమి పెద్దగా పట్టించుకోలేదు. ఫలితంగా.. నగరంలోని పరిస్థితిని రాజంపేట ఎక్సైజ్ అధికారులతో పాటు డీఎస్పీ నారాయణ స్వామిరెడ్డి, నరసింహులు పర్యవేక్షించారు.
మండుటెండలో బారులు.. మద్యం కోసం జనాలు
మందుబాబులు పెద్ద ఎత్తున వైన్ షాపుల వద్దకు చేరుకున్నారు. నిబంధనలు పాటించకుండా మందు కోసం ఎగబడ్డవారిని కట్టడి చేసేందుకు పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. కడప జిల్లాలో పరిస్థితిని రాజంపేట ఎక్సైజ్ అధికారులతో పాటు డీఎస్పీ కూడా పరిశీలించారు.
మండుటెండలో బారులు.. మద్యం కోసం జనాలు