దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా కడప కూడలిలోని సిండికేట్ బ్యాంకు వద్ద ఉద్యోగుల ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. వారంలో ఐదు రోజుల పనిదినాలు కల్పించాలని... కుటుంబ పింఛన్ అమలుపరచాలని నినాదాలు చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే ఫిబ్రవరిలో మరో మూడు రోజులు సమ్మె చేస్తామని కడప బ్యాంకు అధికారుల సంఘం నాయకులు రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. అప్పటికీ స్పందించకుంటే మార్చి నుంచి నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు.
కడపలో బ్యాంకు ఉద్యోగుల సమ్మె - Bank employees strike in Kadapa
సమస్యల పరిష్కారానికి దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చారు. సమ్మెలో భాగంగా కడపలోని అన్ని బ్యాంకుల ఉద్యోగులు విధులను బహిష్కరించి సమ్మె చేశారు. బ్యాంకులు మూసివేయడంతో ప్రజలు అవస్థలు పడ్డారు.
![కడపలో బ్యాంకు ఉద్యోగుల సమ్మె Bank employees strike in Kadapa](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5907452-674-5907452-1580462951537.jpg)
కడపలో బ్యాంకు ఉద్యోగుల సమ్మె