ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా నివేదిక రాకముందే బ్యాంక్ ఉద్యోగి మృతి.. - కడప జిల్లా వార్తలు

కడప జిల్లా రైల్వే కోడూరులో అనుమానాస్పదంగా బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ మృతి చెందారు. కరోనా పరీక్షలు చేయించుకుని నివేదిక వచ్చేలోపే దగ్గు ఆయాసంతో ఆయన చనిపోయారు. కరోనా వైరస్ లక్షణాలు ఉండడంతో అధికారులు మృతదేహాన్ని చుట్టి తగిన జాగ్రత్తలతో కుటుంబసభ్యులకు అప్పగించారు.

kadapa district
కరోనా నివేదిక రాకముందే బ్యాంక్ ఉద్యోగి మృతి

By

Published : Jul 2, 2020, 6:27 PM IST

కడప జిల్లా రైల్వేకోడూరు పట్టణంలోని సిండికేట్ బ్యాంకులో రుణాల రికవరీ విభాగం అసిస్టెంట్ మేనేజర్​గా పని చేస్తున్న షేక్ షావలి హఠాత్తుగా మరణించినట్లు కుటుంబ సభ్యులు, సహఉద్యోగులు తెలిపారు. దగ్గు, ఆయాసం ఎక్కువ కావటంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. అప్పటికే ఆయన చనిపోయారని వైద్యులు తెలిపారు.

కరోనా వైరస్ లక్షణాలు ఉండటంతో మృతదేహాన్ని చుట్టి దూరంగా పెట్టారు. ఆసుపత్రిని రసాయనాలతో శుద్ధి చేయించారు. మృతుడు షావలి గత నెల 19 నుంచి 26 వరకు బ్యాంకుకు సెలవు పెట్టినట్లు తెలిసిందని సీఐ ఆనందరావు అన్నారు. తిరుపతి రుయాలో కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు తెలిపారు. ఫలితాలు ఇంకా రాలేదని వివరించారు. ఈలోపు ఆయన చనిపోవడం అనుమానాస్పదంగా మారిందన్నారు.

మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి తగిన జాగ్రత్తలతో స్వస్థలమైన తాడిపత్రికి పంపించామన్నారు. మృతి చెందిన విషయం తెలుసుకున్న బ్యాంకు అధికారులు, సహోద్యోగులు ఆయన కుటుంబ సభ్యులు సంతాపం వ్యక్తం చేశారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లల ఉన్నారు.

ఇది చదవండి పులివెందులలో గ్రామ వాలంటీర్​పై వైకాపా నాయకుడి దాడి

ABOUT THE AUTHOR

...view details