కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని రైతులు ఎక్కువగా అరటి పంటను పండిస్తున్నారు. ఓబులవారిపల్లి, చిట్వేలు, రైల్వే కోడూరు మండలాల్లో సుమారు 550 ఎకరాల్లో అరటిని సాగుచేస్తున్నారు. పది పదిహేను రోజుల్లో పంట చేతికొస్తుందనే సమయంలో అకాల వర్షాలు, పెను గాలుల వల్ల పంట మొత్తం దెబ్బతింది. లక్షలు వెచ్చించి పండించిన పంట పూర్తిగా ధ్వంసం అవ్వటంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే తమకు పరిహారం చెల్లించాలని రైతులు వేడుకుంటున్నారు.
5 కోట్ల పంట నష్టం