అరటి పంట ఎక్కువగా వచ్చినా... అమ్ముకోలేని స్థితిలో ఉన్నామని కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ రైతులు వాపోతున్నారు. గెలలను కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం వల్ల రైతు సుధాకర్ రాజు, ఆదర్శ రైతు వెంకట రామరాజు... పట్టణంలో పారిశుద్ధ్య కార్మికులకు, పేదవారికి బుధవారం పంపిణీ చేశారు. వేల ఎకరాల్లో పండించిన అరటి పంట కొనేందుకు ఎవరూ రాకపోవడం వల్ల తోటలోనే పండ్లు పాడైపోతున్నాయని ఆవేదన చెందారు.
పారిశుద్ధ్య కార్మికులు, పేదలకు అరటి గెలల పంపిణీ - railway koduru latest news
కడప జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో పారిశుద్ధ్య కార్మికులకు, పేదలకు అరటిగెలలను రైతులు పంచిపెట్టారు. అరటి దిగుబడి ఎక్కువ వచ్చినా.. లాక్డౌన్ కారణంగా వ్యాపారులు కొనేందుకు మొగ్గు చూపటం లేదని వాపోయారు.
అరటి గెలలు పంచిపెడుతున్నరైతులు