ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భక్తిశ్రద్ధలతో బక్రీద్ ప్రార్థనలు - భక్తిశ్రద్ధలతో బక్రీద్ ప్రార్థనలు

కరోనా నిబంధనలు పాటిస్తూ...ప్రసిద్ధి గాంచిన కడప పెద్ద దర్గాలో పీఠాధిపతి అరిఫుల్ల హుస్సేని సమక్షంలో భక్తి శ్రద్ధలతో బక్రీద్ ప్రార్థనలు నిర్వహించారు. కరోనా నుంచి ప్రజలను కాపాడాలని భగవంతుడిని ప్రార్థించినట్లు పీఠాధిపతి తెలిపారు.

భక్తిశ్రద్ధలతో బక్రీద్ ప్రార్థనలు !
భక్తిశ్రద్ధలతో బక్రీద్ ప్రార్థనలు !

By

Published : Aug 1, 2020, 4:11 PM IST

ప్రసిద్ధి గాంచిన కడప పెద్ద దర్గాలో పీఠాధిపతి అరిఫుల్ల హుస్సేని సమక్షంలో భక్తి శ్రద్ధలతో బక్రీద్ ప్రార్థనలు నిర్వహించారు. కరోనా నేపథ్యంలో ముస్లిం సోదరులు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించారు. పీఠాధిపతి ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించి బక్రీద్ ప్రత్యేకత గురించి భక్తులకు వివరించారు. కరోనా నుంచి ప్రజలను కాపాడాలని భగవంతుడిని ప్రార్థించినట్లు పీఠాధిపతి తెలిపారు.

కర్నూలులోనూ వేడుకలు

కర్నూలులో బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. కరోనా సందర్భంగా సామూహిక ప్రార్థనలు నిర్వహించకుండా ఇంట్లోనే కొద్దిమంది వేడుకలు చేసుకున్నారు. కరోనా నుంచి మనావాళిని రక్షించాలని దేవుడిని ప్రార్థించినట్లు మత గురువులు తెలిపారు.

ఇదీచదవండి

విశాఖలో పోలీసుల భద్రత, మౌలిక సదుపాయాలపై కమిటీ ఏర్పాటు

ABOUT THE AUTHOR

...view details