Bail for TDP Leaders in Punganur incident: పుంగనూరు, అంగళ్లలో జరిగిన ఘటనలకూ తమకు ఎలాంటి సంబంధం పలువురు టీడీపీ కార్యకర్తలు పేర్కొన్నారు. అయినప్పటికీ పొలాలలో పని చేసుకుంటున్న తమని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. మంత్రి పెద్దరెడ్డి ప్రోత్సాహంతో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి ఓటమి తప్పదనే భయంతోనే టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని తెలిపారు.
పుంగనూరు, అంగళ్ళ ఘటనలో అరెస్టైన టీడీపీ కార్యకర్తలు, నేతలు కడప కేంద్ర కారాగారంలో 157 రిమాండ్లో ఉన్నారు.వారిలో 52 మందిని ఇవాళ బెయిల్పై విడుదల చేశారు. వారందరికీ తెలుగుదేశం రాష్ట్ర నాయకులు స్వాగతం పలికారు. బెయిల్ పై బయటకు వచ్చిన వారికి మిఠాయిలు తినిపించారు. అనంతరం అరెస్టైన వారి బంధువులను చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు పుంగనూరు సమావేశానికి వస్తున్నారని తాము వెళ్లామని తెలిపారు. మెుదట పెద్దిరెడ్డి వర్గానికి చెందిన వారే తమపై దాడులు చేశారని బాధితులు పేర్కొన్నారు. ఆరోజు ఘటన జరిగిన ప్రదేశంలో తాము లేకపోయినప్పటికీ.. పోలీసులు అక్రమంగా తమపై కేసులునమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 45 రోజులు పాటు జైల్లో ఉన్నామని తెలిపారు. అయినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటామని పేర్కొన్నారు. కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆడిన నాటకమేనని స్పష్టం చేశారు.