కడప జిల్లా బద్వేలులో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. పట్టణంలోని పదకొండవ వార్డు కౌన్సిలర్ కమ్మల ప్రభాకర్ కొవిడ్ సోకి.. మరణించారు. ఇటీవల వైరస్ బారిన పడిన ఆయన.. కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కౌన్సిలర్ మృతిపై.. పురపాలక సంఘం కమిషనర్ కృష్ణారెడ్డి, చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, కౌన్సిలర్లు, ఉద్యోగులు సంతాపం వ్యక్తపరిచారు. ప్రభాకర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
బద్వేలు 11వ వార్డు కౌన్సిలర్ కమ్మల ప్రభాకర్.. కరోనాతో మృతి - badwel latest news
కడప జిల్లా బద్వేలులో కరోనా వ్యాప్తి పెరిగిపోతోంది. పట్టణంలోని పదకొండవ వార్డు కౌన్సిలర్ కమ్మల ప్రభాకర్ కొవిడ్ సోకి మరణించారు. ఆయన మృతిపై పురపాలక సంఘం కమిషనర్ కృష్ణారెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.
11వ వార్డు కౌన్సిలర్ కమ్మల ప్రభాకర్