కడప జిల్లా బద్వేల్(badwel) ఉప ఎన్నిక దసరా తర్వాతే ఉండనున్నట్లు ఈసీ(Election Commission Of India) తెలిపింది. ఈ మేరకు ఉప ఎన్నికను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లు వెల్లడించింది. అక్టోబర్ చివరిలో లేదా నవంబర్‌లో ఉపఎన్నిక నిర్వహించనున్నట్లు తెలిపింది. సిట్టింగ్ వైకాపా ఎమ్మెల్యే వెంకట సుబ్యయ్య మృతితో ఉపఎన్నిక అనివార్యమైంది.
BYPOLL: దసరా తర్వాతే బద్వేల్ ఉప ఎన్నిక - దసరా తర్వాతే బద్వేల్ ఉపఎన్నిక వార్తలు
![BYPOLL: దసరా తర్వాతే బద్వేల్ ఉప ఎన్నిక badwel by poll will be conducted after dasara festival](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12966737-24-12966737-1630748289031.jpg)
13:38 September 04
అక్టోబర్ చివరిలో లేదా నవంబర్‌లో ఉపఎన్నిక నిర్వహణ: ఈసీ
హుజూరాబాద్‌లో..
తెలంగాణలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మారిన హుజూరాబాద్ ఉప ఎన్నికపై ఈసీ స్పందించింది. దసరా తర్వాతే హుజూరాబాద్ ఉప ఎన్నిక నిర్వహిస్తామని స్పష్టం చేసింది. పండగల సీజను ముగిశాకే ఉప ఎన్నిక నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం కోరిందని ఈసీ వెల్లడించింది. అక్టోబర్ లేదా నవంబర్‌లో ఉప ఎన్నిక ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఎన్నికల నిర్వహణపై ఆయా రాష్ట్రాల అభిప్రాయాలను కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంది. ఈ నెల 1వ తేదీన 12 రాష్ట్రాల సీఎస్‌లతో సీఈసీ సమావేశమైంది.
ఇదీ చదవండి: