దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పార్లమెంట్, శాసనసభ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మూడు పార్లమెంట్, 30 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో తెలుగు రాష్ట్రాల్లోని హుజూరాబాద్, బద్వేలు శాసనసభ నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. హుజురాబాద్, బద్వేలులో అక్టోబర్ 30న ఎన్నికల పోలింగ్ జరగనుంది. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.
షెడ్యూల్ విడుదల..
బద్వేలు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిల షెడ్యూల్ విడుదలైంది. వైకాపా ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మృతితో ఖాళీ అయిన ఈ స్థానానికి అక్టోబర్ 30న పోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ మేరకు అక్టోబర్ 1న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది.
కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల తేదీ ఖరారైంది. వైకాపా ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య అనారోగ్యంతో ఈ ఏడాది మార్చి 28న మృతి చెందడంతో బద్వేల్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది. దేశంలో వివిధ స్థానాలకు ఉపఎన్నికల షెడ్యూల్ ఖరారు చేసిన ఎన్నికల సంఘం...బద్వేల్‌లో అక్టోబర్ 30న ఎన్నికలు నిర్వహించనుంది. నవంబర్ 2న ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అక్టోబర్ 1న ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అక్టోబర్ 8 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 11న నామినేషన్ల పరిశీలించనుండగా.. ఉపసంహరణకు అక్టోబర్ 13 వరకు గడువిచ్చారు.
అధికార వైకాపా ఇప్పటికీ అభ్యర్థిని ప్రకటించనప్పటికీ.. వెంకటసుబ్బయ్య భార్య సుధ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. వెంకటసుబ్బయ్య మృతిచెందిన రోజే అంత్యక్రియలు హాజరైన సీఎం జగన్..ఆమెకు మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. జగన్ హామీతోనే ఆమె నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించారు. పది రోజుల నుంచి గ్రామాల్లో తిరుగుతూ పరిచయ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అయితే అధిష్ఠానం ఆమె పేరును అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది.
తెదేపా అభ్యర్థి ఎవరంటే..
తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఇప్పటికే ప్రకటించింది. గత ఎన్నికల్లో వెంకటసుబ్బయ్యపై పోటీ చేసి ఓటమి పాలైన ఓబులాపురం రాజశేఖర్‌నే మరోసారి బరిలో నిలిపింది. 20 రోజుల కిందట చంద్రబాబునాయుడు అమరావతిలో జరిగిన పార్టీ సమావేశంలో రాజశేఖర్ పేరు ఖరారు చేశారు. ముందుగానే అభ్యర్థి ఖరారుకావడంతో..ఆయన ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా ముఖ్యనేతలను కలిసి ఎన్నికల్లో మద్దతు కోరుతున్నారు. ఈయన 2019 ఎన్నికల్లో బద్వేలు అసెంబ్లీకి తెదేపా తరపున పోటీ చేసి వెంకటసుబ్బయ్య చేతిలో ఓడిపోయారు. మరోసారి తెదేపా ఈయనకే అవకాశం ఇచ్చింది.
ఇదీ చదవండి: AP RAINS: గులాబ్ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు.. వరద నీటిలోనే ప్రజలు