బద్వేలు ఉప ఎన్నిక కోసం నేటి నుంచే నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈనెల 13న నామినేషన్ల ఉప సంహరణకు అవకాశమిచ్చారు. అక్టోబరు 30న పోలింగ్, నవంబర్ 2న ఓట్ల లెక్కింపు నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు నుంచి నాలుగేళ్లు పైబడి బద్వేలు నియోజకవర్గంలో పనిచేస్తున్న తహశీల్దార్లు, ఎంపీడీఓలను బదిలీ చేశారు. కొవిడ్ నిబంధనల మేరకు... ప్రచార సమయంలో ఇళ్లమధ్య సభలు నిర్వహించుకుంటే 200 మందికి మించి ఉండరాదని నిబంధనలు పెట్టారు.
ఎన్నికల స్టార్ కాంపెయినర్లు వస్తే వారి సభలకు వెయ్యిమంది, స్టార్ కాంపెయినర్లు కానివారి సభకు 500 మందికి మించకుండా సభ నిర్వహించు కోవాలని ఈసీ నిబంధనలు విధించింది. రోడ్ షోలు, బైక్ ర్యాలీలు చేపట్టకూడదని... ఇంటింటి ప్రచారానికి వెళ్లే అభ్యర్థులు కేవలం ఐదుగురు మాత్రమే ఉండే విధంగా చూసుకోవాలని నిబంధనలు విధించారు .