ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా మృతుల కుటుంబాలకు ఆర్టీసీ కార్మికుల వితరణ - బద్వేల్ ఆర్టీసీ కార్మికుల సహాయం

కొవిడ్ ధాటికి మృతి చెందిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు ఆ సంస్థ సిబ్బంది అండగా నిలుస్తున్నారు. ఒక రోజు వేతనాన్ని వారికి విరాళంగా ఇచ్చి.. ఉన్నతాధికారుల ద్వారా బాధిత కుటుంబాలకు అందిస్తున్నారు. కొవిడ్​తో మృతి చెందిన బద్వేల్​లోని ఓ ఉద్యోగి కుటుంబీకులకు.. కడప రీజినల్ మేనేజర్ ఈ రోజు 5 లక్షల రూపాయల చెక్కును అందించారు.

rtc employees help
ఆర్టీసీ సిబ్బంది వితరణ

By

Published : Nov 6, 2020, 4:57 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా 80 మంది ఆర్టీసీ కార్మికులు.. కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయినట్లు కడప రీజినల్ మేనేజర్ జితేంద్ర నాథ్ రెడ్డి తెలిపారు. వైరస్​తో ఇటీవల మరణించిన ఓ ఉద్యోగి కుటుంబానికి.. బద్వేల్ ఆర్టీసీ కార్యాలయంలో ఐదు లక్షల రూపాయల చెక్కును అందజేశారు.

సంస్థకు వెన్నెముకగా ఉన్న సిబ్బంది మహమ్మారితో మృతి చెందడం బాధ కలిగించిందని పేర్కొన్నారు. ఉద్యోగులు ఒక రోజు వేతనాన్ని ఇచ్చినట్టు తెలిపారు. ఆ మొత్తాన్ని.. ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు అందిస్తున్నట్టు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details