ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనారోగ్యంతో.. బద్వేల్ ఎమ్మెల్యే డా. వెంకట సుబ్బయ్య కన్నుమూత - Badwell MLA Venkata Subbayya died news

Badwell MLA Venkata Subbayya died
బద్వేల్ ఎమ్మెల్యే డా. వెంకట సుబ్బయ్య కన్నుమూత

By

Published : Mar 28, 2021, 7:39 AM IST

Updated : Mar 28, 2021, 3:53 PM IST

07:38 March 28

బద్వేల్ ఎమ్మెల్యే డా. వెంకట సుబ్బయ్య కన్నుమూత

కడప జిల్లా బద్వేల్ శాసనసభ్యుడు డాక్టర్ వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో మృతిచెందారు. కడపలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 6:30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లల్లో ఒకరు ఎంబీబీఎస్ చేస్తుండగా... మరొకరు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. కడపలో ఆర్థోపెడిక్ డాక్టర్​గా వెంకటసుబ్బయ్య  కొంత కాలం సేవలందించారు.

వైకాపా నుంచి 2019లో తొలిసారిగా బద్వేల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. బద్వేలు నియోజకవర్గం ఎస్సీ రిజర్వు అయిన కారణంగా.. మంచి సౌమ్యుడిగా పేరున్న డాక్టర్ వెంకట సుబ్బయ్యకు వైకాపా అధిష్ఠానం ఎమ్మెల్యే సీటు కేటాయించింది. రెండేళ్ల నుంచి ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. 3 నెలలుగా ఇంటికే పరిమితమయ్యారు. హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స సైతం తీసుకున్నారు.

పది రోజుల కిందటే హైదరాబాద్ నుంచి ఆయన కడపకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి  ఆయనను ఫోన్లో పరామర్శించారు. యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.  ఈ క్రమంలోనే నిన్న తీవ్ర అస్వస్థతకు గురికాగా ... కడపలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు కుటంబసభ్యులు. చికిత్స పొందుతూ ఈ ఉదయం వెంకటసుబ్బయ్య  కన్నుమూశారు.  విషయం తెలుసుకున్న పార్టీ నాయకులు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

ఆయన మృతదేహాన్ని బద్వేల్​కు  తీసుకెళ్లనున్నారు. అక్కడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రజల సందర్శనార్థం పార్థివదేహాన్ని ఉంచుతారు. అక్కడినుంచి  కడపకు తీసుకొచ్చి సొంత పొలాల్లో అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆయన సోదరుడు సుబ్బారావు తెలిపారు. 

హాజరుకానున్న సీఎం..

ముఖ్యమంత్రి జగన్ మధ్యాహ్నం 3 గంటలకు కడప వెళ్లనున్నారు. అనారోగ్యంతో మృతిచెందిన.. బద్వేలు ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా.. కడప కోఆపరేటివ్‌ సొసైటీ కాలనీలో ఉంటున్న వెంకటసుబ్బయ్య నివాసానికి సీఎం వెళ్లనున్నారు. పరామర్శ అనంతరం తిరిగి తాడేపల్లి చేరుకోనున్నారు.


 

ఇదీ చూడండి:

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం, 8 మంది దుర్మరణం

'మృతులంతా తమిళులే.. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నాం'

Last Updated : Mar 28, 2021, 3:53 PM IST

ABOUT THE AUTHOR

...view details