కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. వాహనదారులతో పాటు పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో రహదారులు మరింత ఛిద్రమయ్యాయి. నియోజకవర్గంలో మైదుకూరు మండలం వెంకటాపురం నుంచి వనిపెంట, ఖాజీపేట మండలంలో ఖాజీపేట-సుంకేసుల, ఖాజీపేట-కమలాపురం, బీచువారిపల్లె, చాపాడు మండలం అల్లాడుపల్లె-ఏటూరు దువ్వూరు మండలం నేలటూరు, ఇడమడక-నారాయణపల్లె రహదారులు దెబ్బతిన్నాయి.
మైదుకూరులో అధ్వానంగా రహదారులు - మైదుకూరులో అద్వానంగా రోడ్లు
కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో రోడ్డుల పరిస్థితి దారుణంగా ఉంది. నియోజకవర్గంలో 316 కిలోమీటర్లు రహదారులు ఉండగా 50 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు.

మైదుకూరులో అద్వానంగా రహదారులు
నియోజకవర్గంలో 316 కిలోమీటర్లు రహదారులు ఉండగా 50 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నట్లు అధికారులు చెబుతున్నారు. తాత్కాలిక మరమ్మతులకు రెండు కోట్ల రూపాయలు, శాశ్వత మరమ్మతులకు 30 కోట్ల రూపాయలు నిధులు అవసరమవుతాయని రోడ్డు భవనాల శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
ఇదీ చదవండి: అమరావతికి మరోసారి గుర్తింపు