ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఉజ్జయిని' టూ 'శబరిమల'.. అయ్యప్ప భక్తుడి పాదయాత్ర - కడప భక్తుడి పాదయాత్ర వార్తలు

రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ఓ అయ్పప్ప భక్తుడు ఉజ్జయిని నుంచి శబరిమలకు పాదయాత్ర చేస్తున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇప్పటివరకు 3,650 కిలోమీటర్లు నడిచాడు. ప్రస్తుతం కడపలో ఉన్న అతను అయ్యప్ప క్షేత్రానికి పయనమయ్యాడు.

ayyappa devotee foot trip on ujjayini to sabarimala
రవీంద్రారెడ్డి పాదయాత్ర

By

Published : Dec 16, 2019, 11:56 AM IST

రవీంద్రారెడ్డి పాదయాత్ర

కడప జిల్లా పులివెందులకు చెందిన రవీంద్రారెడ్డి సెప్టెంబర్ 2న పాదయాత్ర ప్రారంభించారు. తన గురువు సంకల్పం మేరకు ఉజ్జయిని జ్యోతిర్లింగం నుంచి శబరిమలకు యాత్ర చేస్తున్నట్లు తెలిపారు. ఉజ్జయిని నుంచి మొదలుపెట్టి.. దారిలోని శక్తి పీఠాలు దర్శించుకుంటూ నేటికి 3,650 కిలోమీటర్లు నడిచారు. ఈనెల 13కి కడప జిల్లా జమ్మలమడుగుకి చేరుకున్నారు. రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి మంచి పంటలు పండాలని ఈ పాదయాత్ర చేస్తున్నట్లు చెప్పారు. ఆలంపూర్ జోగులాంబ శక్తిపీఠం దర్శించుకుని అక్కడినుంచి కడపకు వచ్చినట్లు తెలిపారు. ఇక్కడినుంచి శబరిమలకు వెళ్లనున్నట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details