ఈటీవీ భారత్, ఈనాడు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు - Awareness seminar under the direction of ETV India today
ఈటీవీ భారత్, ఈనాడు ఆధ్వర్యంలో కడప జిల్లా కలసపాడులో ఓటు హక్కు వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఓటు హక్కు విలువలపై విద్యార్థులకు వివరించారు.
![ఈటీవీ భారత్, ఈనాడు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఈటీవీ భారత్ ఈనాడు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6443331-47-6443331-1584455288157.jpg)
ఈటీవీ భారత్ ఈనాడు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
ఈటీవీ భారత్, ఈనాడు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
కడప జిల్లా కలసపాడులోని షిర్డీ సాయిబాబా ఐటీఐ కళాశాలలో ఈటీవీ భారత్, ఈనాడు ఆధ్వర్యంలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సదస్సులో పాల్గొన్న ప్రిన్సిపల్ రమేశ్ బాబు మాట్లాడుతూ ఓటు వజ్రాయుధం లాంటిదని తెలిపారు. ఎన్నికల్లో మంచి నాయకున్ని ఎన్నుకోవాలని సూచించారు. ఎన్నికలలో డబ్బు, మద్యం ఎరవేసి ఓటర్లను ప్రలోభ పెడతారని వాటికి లొంగకూడదని సదస్సులో పాల్గొన్న అధ్యాపకులు తెలిపారు.