...
బోయనపల్లిలో దిశ చట్టంపై అవగాహన సదస్సు - సమాఖ్య మహిళలకు దిశ చట్టంపై అవగాహన సదస్సు
దిశ చట్టంపై మహిళలకు సంపూర్ణ అవగాహన కల్పించాలని డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ మురళీ మనోహర్ తెలిపారు. కడప జిల్లా రాజంపేట మండలం బోయనపల్లిలోని వెలుగు కార్యాలయంలో సమాఖ్య మహిళలకు దిశ చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దిశ చట్టాన్ని ప్రతి మహిళకు తెలిసేలా ప్రచారం చేయాలని సూచించారు. మహిళా సమాఖ్య సమావేశాల్లో తొలి అంశంగా దిశ చట్టంపై చర్చించాలని సందేహాలు నివృత్తి చేయాలని తెలిపారు. జిల్లాలో దిశ చట్టానికి సంబంధించి ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పడే అవకాశం ఉందనన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల ఏపీఎంలు, సీసీలు, మహిళా సమాఖ్య అధ్యక్షులు పాల్గొన్నారు.
బోయనపల్లిలో సమాఖ్య మహిళలకు దిశ చట్టంపై అవగాహన సదస్సు