ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నిబంధనలు పాటించండి.. కరోనా వైరస్ కట్టడికి సహకరించండి' - ప్రొద్దుటూరులో కరోనాపై అవగాహన ర్యాలీ

కడప జిల్లా ప్రొద్దుటూరులో పోలీసులు కరోనాపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రైవేటు ఆసుపత్రుల వైద్యుల సహకారంతో ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రభుత్వం నిబంధనలు పాటిస్తూ ప్రతిఒక్కరూ కరోనా కట్టడికి సహకరించాలని కోరారు.

awareness rally on corona in proddutur kadapa district
ప్రొద్దుటూరులో కరోనాపై అవగాహన ర్యాలీ

By

Published : Jun 21, 2020, 7:23 AM IST

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని కడప జిల్లా ప్రొద్దుటూరు డీఎస్పీ సుధాకర్ అన్నారు. పట్టణంలో పోలీసులు, ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు కొవిడ్​పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఉమేష్ చంద్ర కూడలి నుంచి శివాలయం వరకు ర్యాలీ కొనసాగింది.

తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని, బయటకు వెళ్లేటప్పుడు మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. దగ్గు, జలుబు, జ్వరం లాంటి సూచనలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలని కోరారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details