ప్రభుత్వ మద్దతు ధర కంటే తక్కువగా రైతులు ధాన్యాన్ని అమ్ముకునే పరిస్థితి రాకూడదని కడప జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎం.గౌతమి అన్నారు. కలెక్టరేట్ సభా భవనంలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి, ధాన్యం కొనుగోలుపై అవగాహన కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ- కడప ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. రైతు వివరాల నమోదు, నాణ్యతా విశ్లేషణ, ధాన్యం కొనుగోళ్లపై.. సిబ్బందికి, గ్రామ వ్యవసాయ సహాయకులకు అవగాహన కల్పించారు.
ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది...
రైతులకు ప్రభుత్వమే గిట్టుబాటు ధర కల్పించి, వారికి లాభం చేకూర్చేలా ధాన్యాన్ని కొనుగోలు చేస్తోందని ఇంఛార్జ్ కలెక్టర్ గౌతమి అన్నారు. మొట్టమొదటి సారిగా రైతు భరోసా కేంద్రాల్లో ఖరీఫ్ పంటధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ధాన్యం కొనుగోలు నిర్వహణ కోసం అన్ని రైతు భరోసా కేంద్రాల్లో సీఎం యాప్ నిర్వహణను చేపట్టాలన్నారు. ఈ- క్రాపింగ్ లో గుర్తింపు పొందిన రైతుల వివరాలను మాత్రమే ప్రోక్యుర్మెంట్ పోర్టల్ లో నమోదు చేయాలని సూచించారు. రైతులకు చెందిన భూమి వివరాలను నమోదు చేసే విషయాలో జాగ్రతలు పాటించాలని అన్నారు.
ఇదీచదవండి.