కడప డీఎస్పీ కార్యాలయంలో ఆటో డ్రైవర్లకు పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జనవరి 15 తర్వాత ఖాకీ యూనిఫాం లేకుండా ఆటో నడిపితే కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ స్పష్టం చేశారు. జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త పన్నుల విధానంతో.. ప్రతి ఒక్కరూ అన్ని పత్రాలను దగ్గర పెట్టుకోవాలని సూచించారు.
మద్యం తాగి ఆటో నడిపితే రూ. 10వేల వరకు జరిమానా తప్పదని హెచ్చరించారు. ఎవరైనా చెడు అలవాట్లకు బానిసై.. లేనిపోని సమస్యలను సృష్టిస్తే కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. అలాగే ఆటోల్లో స్పీకర్లు, అదనపు సీట్లు ఉంటే వెంటనే తొలగించాలని తెలిపారు.