ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నృత్య తరంగిణి కళానిలయం.. అవార్డులు కచ్చితం..! - కడప జిల్లాలోని నృత్య తరంగిణి కళానిలయం

Awards to Nrutyatarangini Dance School: సంప్రదాయ నృత్యం అంటే వారికి చాలా ఇష్టం. కాలికి గ‌జ్జె కట్టి వేదిక‌పై నృత్యం చేశారంటే పుర‌స్కారం పండాల్సిందే. ఓ వైపు చ‌దువు, మ‌రో వైపు కూచిపూడి, జాన‌ప‌దం నృత్యాల్లో రాణిస్తూ.. స‌త్తా చాటుతున్నారు. పిల్లల ఆసక్తితోపాటు తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా తోడవ్వటంతో.. మరింతగా దృష్టి సారిస్తున్నారు. శిక్షకుడి వద్ద మెళకువలు నేర్చుకుంటూ ప్రత్యేక సాధన చేస్తూ.. నృత్య పోటీల్లో అవార్డుల పంట పండిస్తున్న కడప జిల్లా ప్రొద్దుటూరు బాలికలపై ప్రత్యేక కథనం.

awards to nrutyatarangini dance school students
నృత్య తరంగిణి కళానిలయం

By

Published : Feb 5, 2022, 7:54 PM IST

నృత్య తరంగిణి కళానిలయం

Awards to Dance School: కడప జిల్లా ప్రొద్దుటూరు వైఎమ్​ఆర్ (YMR) కాలనీలోని నృత్య తరంగిణి కళానిలయంలో వందకు మందికి పైగా బాలికలు కూచిపూడి నేర్చుకుంటున్నారు. స్థానికులతో పాటు మైదుకూరు, ఇతర గ్రామాల నుంచి వచ్చి.. శిక్షకుడు శ్రావ‌ణ్‌కుమార్ వ‌ద్ద తర్ఫీదు తీసుకుంటున్నారు. ఒకవైపు చదువుకుంటూనే.. ఖాళీ సమయాల్లో కూచిపూడి నేర్చుకుంటున్నారు. సెలవు దినాల్లో ఉదయం, సాయంత్రం నృత్య తరగతులు నిర్వహిస్తున్నారు. శిక్షణ పొందిన వారంతా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి వేదికలపై ప్రదర్శనలు ఇచ్చి అవార్డులు సైతం సొంతం చేసుకుంటున్నారు. పోటీల్లో అవార్డులు గెలుచుకోవటం ఆనందంగా ఉందని విద్యార్థులు చెబుతున్నారు.

ఆల్ ఇండియా స్థాయి నృత్య పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు

ఇటీవల చిలకలూరిపేటలో కళానిలయం వారి 37వ ఆల్ ఇండియా స్థాయి నృత్య పోటీలు జరిగాయి. ఏపీతో పాటు తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాల నుంచి సుమారు 500 మంది పోటీల్లో పాల్గొన్నారు. అందులో ప్రొద్దుటూరులోని తరంగిణి నృత్య కళానిలయానికి చెందిన సుమారు 20 మంది విద్యార్థులు ప్రదర్శనలు ఇచ్చారు. శిక్షకుడు ఇచ్చే మెళకువలు తెలుసుకుంటూ నాట్యంపై మరింత పట్టు సాధించి, మరిన్ని అవార్డులు గెలుచుకుంటామని బాలికలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.


ఇదీ చదవండి:

Hanuman Land: ఈనె 16న తిరుమలలో హనుమాన్‌ జన్మస్థలానికి భూమిపూజ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details