కడప జిల్లా కమలపురానికి చెందిన మదర్ థెరిస్సా చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ విజయ్ కుమార్ కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్నారు. ట్రస్టు ద్వారా 2005 నుంచి రక్తదానం కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సంస్థ ఛైర్మన్ తెలిపారు. రక్తదానం చేయటం వల్ల మన ఆరోగ్యం కూడా బాగుపడుతుందన్నారు. ఆరిపోయే దీపాన్ని వెలిగించేది చమురు ఐతే, ఆగిపోయే ప్రాణాన్ని కాపాడేది రక్తదానమని అన్నారు. సంస్థ ద్వారా రక్తదానమే కాకుండా అనేక సేవ కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు తెలిపారు.
'ఆగిపోయే ప్రాణాన్ని కాపాడేది రక్తదానమే' - మదర్ థెరిస్సా చారిట్రబుల్ ట్రస్ట్ తాజా వార్తలు
కడప జిల్లా కమలాపురంలో మదర్ థెరిస్సా చారిట్రబుల్ ట్రస్ట్ ఛైర్మెన్.. కలెక్టర్ చేతులు మీదుగా ప్రశంస పత్రం అందుకున్నారు. రక్తదానం చేయండి.. చేయించండి అనే పిలుపుతోపాటు ట్రస్ట్ ద్వారా అనేక సేవ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన్ను కలెక్టర్ అభినందించారు.
మదర్ థెరిస్సా చారిట్రబుల్ ట్రస్ట్ ఛైర్మెన్