కడప జిల్లా మైదుకూరు పురపాలికలోని ధరణి తిమ్మాయపల్లెలో అవదూత కొండయ్య స్వామి 37వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకలు తిలకించేందుకు జిల్లాతోపాటు పొరుగు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. భక్తులు తెచ్చిన భారీ కేక్‌లను స్వామి కోశారు. వేడుక తిలకించేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులకు కొండయ్య స్వామి స్వయంగా కేక్‌ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్కభజన, కోలాట ప్రదర్శనలను ఆకట్టుకున్నాయి.
అవదూత కొండయ్య స్వామి జన్మదిన వేడుకలు
అవదూత కొండయ్య స్వామి 37వ జన్మదిన వేడుకలను మైదుకూరులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులు మధ్య స్వామి కేక్ కట్ చేశారు.
ఘనంగా అవధూత కొండయ్య స్వామి 37వ జన్మదిన వేడుకలు