ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అఖిలప్రియ అరెస్టును ఎందుకు ఆలస్యం చేస్తున్నారు?: ఏవీ సుబ్బారెడ్డి - ఏవీ సుబ్బారెడ్డి వార్తలు

తెదేపా నేత ఏవీ సుబ్బారెడ్డి.. కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ను కలిశారు. తనను హతమార్చేందుకు మాజీ మంత్రి అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్ కుట్ర పన్నారని.. ఆమె అరెస్టును ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించారు.

av subbareddy
av subbareddy

By

Published : Jul 16, 2020, 2:49 PM IST

కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ను తెదేపా నేత ఏవీ సుబ్బారెడ్డి కలిశారు. మాజీ మంత్రి అఖిలప్రియను ఎందుకు ఇంకా అరెస్టు చేయలేదనే ఎస్పీని కలిశామని ఏవీ సుబ్బారెడ్డి తెలిపారు. అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్‌ను అరెస్టు చేయకుండా ఎ6ను అరెస్టు చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. పోలీసులు నోటీసులు జారీచేసినా ఎస్పీ ఎదుట భార్గవ్‌ హాజరు కాలేదని చెప్పారు. ఎందుకు ఇంత జాప్యం చేస్తున్నారని నిలదీశారు.

ABOUT THE AUTHOR

...view details