ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజంపేటలో శానిటైజర్ విక్రయ దుకాణాలపై నిఘా

ఎస్పీ అన్బురాజన్ ఆదేశాల మేరకు రాజంపేటలో ప్రైవేటు దుకాణాలపై పోలీసులు దాడులు చేశారు. ఇటీవల కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు శానిటైజర్​లను ఎక్కువగా వినియోగిస్తున్నారని డీఎస్పీ నారాయణ స్వామి చెప్పారు. ఈ శానిటైజర్​ విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. కొంతమంది మద్యానికి బానిసై వాటిని కొనుగోలు చేస్తున్నారన్నారు. శానిటైజర్ కొనుగోలు చేసిన వ్యక్తి పేరు, వివరాలు నమోదు చేసుకోవాలని దుకాణాదారులకు సూచించారు.

రాజంపేటలో శానిటైజర్ విక్రయ దుకాణాలపై నిఘా పెట్టాం : డీఎస్పీ నారాయణ స్వామి
రాజంపేటలో శానిటైజర్ విక్రయ దుకాణాలపై నిఘా పెట్టాం : డీఎస్పీ నారాయణ స్వామి

By

Published : Aug 6, 2020, 4:49 PM IST

రాజంపేటలో శానిటైజర్ విక్రయ దుకాణాలపై దాడులు

కడప జిల్లా రాజంపేటలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శానిటైజర్​ వినియోగం పెరుగుతోంది. అనుమతి,బిల్లు లేకుండా శానిటైజర్ల విక్రయించటం నేరమని డీఎస్పీ నారాయణ స్వామి అన్నారు. అనుమతి ఉన్నా కంపెనీ నుంచి మాత్రమే వాటిని కొనుగోలు చేయాలని ఆయన వ్యాపారులకు సూచించారు. బయట ఎవరు పడితే వారు తయారుచేయడం నిషేధం అన్నారు. కొంతమంది మద్యం ప్రియులు మత్తు కోసం శానిటైజర్​లను తాగి ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. దీనిపై ఎస్పీ అన్బురాజన్ ఆదేశాల మేరకు ప్రైవేటు దుకాణాలు, మందుల షాప్​లపై దాడులు చేస్తున్నట్లు తెలిపారు. శానిటైజర్​లను ఎవరికి విక్రయించినా వారి పేరు, సెల్ ఫోన్ నెంబర్ నమోదు చేసుకోవాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details