Attack On Viveka Murder Case Accused Uma Shankar Wife : "వివేకానంద రెడ్డిని ఏ విధంగా హత్య చేశారో.. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత నీ భర్తను కూడా అదే విధంగా చంపుతాం" ఇది వివేకా హత్య కేసు నిందితుడు ఉమాశంకర్ రెడ్డి భార్యకు వచ్చిన బెదిరింపులు. కసునూరుకు చెందిన కొమ్మ పరమేశ్వర్ రెడ్డి తనని బెదిరించాడని ఉమా శంకర్ రెడ్డి భార్య స్వాతి ఆరోపించారు. నిన్న మధ్యాహ్నం పులివెందులలో తన ఇంటి వద్దకు వచ్చిన పరమేశ్వర్ రెడ్డి.. బూతులు తిడుతూ అసభ్యకరంగా దుర్భాషలాడి హెచ్చరించాడని స్వాతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివేకానంద రెడ్డిని హత్య చేసి డబ్బులు తీసుకొని జల్సా చేస్తున్నారా అంటూ దుర్భాషలాడినట్లు ఆమె పోలీసులకు వివరించారు.
వివేకా హత్య కేసు నిందితుడు ఉమాశంకర్ భార్యపై దాడి "నిన్న మధ్యాహ్నం కసునూరు పరమేశ్వర రెడ్డి మా ఇంటికి వచ్చి నానా బూతులు తిట్టాడు. నీ భర్త వివేకానందరెడ్డిని చంపి ఎంజాయ్ చేస్తున్నారా అంటూ చాలా ఘెరంగా తిట్టాడు. వాటిని నేను చెప్పలేను. నీ భర్త జైలు నుంచి ఇంటికి వచ్చిన తర్వాత.. వివేకానందరెడ్డిని ఏ విధంగా అయితే చంపారో అలానే చంపుతామన్నారు. నన్ను కూడా చంపుతామన్నారు. కాళ్లకు ఉన్న చెప్పులతో కొట్టబోయాడు. నేను వెంటనే వేరే గదిలోకి వెళ్లి దాక్కున్న. నా కుటుంబానికి ఏదైనా జరిగితే పరమేశ్వర రెడ్డిదే బాధ్యత" -స్వాతి, ఉమాశంకర్‌రెడ్డి భార్య
నిన్న సాయంత్రం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. కొమ్మ పరమేశ్వర్ రెడ్డి చెప్పు తీసుకొని తనపై దాడికి యత్నించడమే కాకుండా సెల్ ఫోన్ లాక్కొని కిందికి పడేశాడని ఆమె వాపోయారు. పరమేశ్వర్ రెడ్డి వెంట ఆయన కుమారుడు కూడా వచ్చాడని ఆమె తెలిపారు. తనకు దెబ్బలు తగలడంతో పులివెందుల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. పులివెందుల ఆసుపత్రిలో స్వాతి నుంచి పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. తనకు, తన కుటుంబానికి ఏదైనా హాని జరిగితే దానికి కొమ్మ పరమేశ్వర్ రెడ్డిదే బాధ్యత అని ఆమె వెల్లడించారు.
Viveka Murder Case Updates : మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఉమాశంకర్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన కడప జైలులో ఉన్నాడు. వివేకా హత్య కేసును తెలంగాణకు బదిలీ చేసిన అనంతరం కేసు దర్యాప్తు దూకుడుగా సాగుతోంది. ఈ కేసులో మొదటిసారి ఐదుగురు నిందితులను ఒకేసారి విచారించారు. గత నెల ఫిబ్రవరి 10వ తేదీన హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణ జరిపారు. పోలీసు బందోబస్తు మధ్య సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని ఫిబ్రవరి 10వ తేదీన తెల్లవారుజామున 4 గంటలకు కడప జైలు నుంచి హైదరాబాద్ తీసుకువెళ్లారు. నాలుగు వాహనాల్లో ముగ్గురు నిందితులను వేరువేరుగా హైదరాబాదుకు తరలించారు.
ఇవీ చదవండి: