ప్రొద్దుటూరులో ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిపై కత్తితో దాడి - ప్రొద్దుటూరు తాజా వార్తలు
12:57 January 22
యువతిపై కత్తితో దాడి చేసిన సునీల్
ప్రేమ పేరుతో ఉన్మాదులు చెలరేగిపోతూనే ఉన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రేమ పేరుతో లావణ్య అనే యువతిపై... సునీల్ అనే కిరాతకుడు కత్తితో దాడి చేశాడు. నేతాజీ నగర్‌లోని ఇంట్లో యువతి ఒంటరిగా ఉన్నప్పుడు ఒక్కసారిగా ఘాతుకానికి తెగబడ్డాడు. ఈ ఘటనలో బాధిత యువతి తీవ్రంగా గాయపడింది. విపరీతంగా రక్తస్రావమై ఆమె దుస్తులు పూర్తిగా రక్తంతో తడిసిపోయాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు... యువతిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం లావణ్య చికిత్స పొందుతోంది. విషయం తెలుసుకున్న పోలీసులు... ఆసుపత్రిని సందర్శించి ఘటన వివరాలు సేకరించారు. నిందితుడు సునీల్ 3 నెలలుగా వెంట పడుతున్నాడని... ఇటీవలే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామని యువతి తల్లి చెబుతున్నారు.
ఇదీ చదవండి:గుండెపోటుతో.. రాజధానికి చెందిన మరో రైతు మృతి