ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యం విక్రయించలేదని యువకుడిపై దాడి.. నలుగురి అరెస్ట్ - vanipenta latest news

మద్యం విక్రయించలేదనే కారణంతో యువకుడిపై ఓ వ్యక్తి దాడి చేశాడు. ఈ ఘటన కడప జిల్లాలో జరిగింది. దాడి చేసి.. పెట్రోలు పోసి నిప్పంటించారని బాధితుడు వాపోయాడు. ఈ ఘటనలో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

మద్యం విక్రయించలేదని... యువకుడిపై దాడి
యువకుడిపై దాడి

By

Published : Jun 14, 2021, 10:55 AM IST

Updated : Jun 14, 2021, 8:41 PM IST

మద్యం విక్రయించలేదని... యువకుడిపై దాడి

కడప జిల్లా మైదుకూరు మండలం వనిపెంట గ్రామపంచాయతీలో దారుణం జరిగింది. మద్యం విక్రయించడం లేదనే కారణంతో నాని అనే వ్యక్తిని తీవ్రంగా గాయపరిచారు. గ్రామానికి చెందిన నాని.. వెల్డింగ్ పని చేస్తూ జీవిస్తున్నాడు. స్థానికంగా ఉండే కొందరు మద్యం అక్రమంగా విక్రయించాలని నానిపై ఒత్తిడి తీసుకొచ్చారు. దీనికి అతను ఒప్పుకోకపోవడంతో ఆగ్రహానికి గురైన ఆ వ్యక్తులు.. కాళ్లను విద్యుత్ తీగలతో నానిని కట్టేసి చితకబాదారు. అంతటితో ఊరుకోక పెట్రోలు పోసి నిప్పంటించారు.

అక్కడే ఉన్న మరో కొంతమంది.. చూసి అడ్డుకోవడంతో వారు అక్కడి నుంచి పారిపోయారు. నానికి ఒళ్లంతా పూర్తిగా కాలిపోయింది. తీవ్రగాయాలైన నానిని చికిత్స నిమిత్తం కడప ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. ఈ దాడి ఘటనలో నలుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకున్నారు. ఘటన జరిగిన 24 గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకున్నట్లు కడప అదనపు ఎస్పీ దేవ ప్రసాద్ తెలిపారు.

Last Updated : Jun 14, 2021, 8:41 PM IST

ABOUT THE AUTHOR

...view details