తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం - mydakuru
ఎన్నికల్లో పార్టీ విజయం కోసం శ్రమించిన కార్యకర్తలతో పుట్టాసుధాకర్ యాదవ్ సమావేశమయ్యారు. తన విజయానికి కృషి చేసిన వారితో ఆత్మీయ భేటీ నిర్వహించారు.
కడప జిల్లా మైదకూరులో తెలుగుదేశం విజయంపై ఆ పార్టీ అభ్యర్థి పుట్టాసుధాకర్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. తనను గెలిపించడానికి పని చేసిన కార్యకర్తలతో ఆయన ఆత్మీయ భేటీ ఏర్పాటు చేశారు. పార్టీ కార్యాయంలో నిర్వహించిన సమావేశానికి భారీ సంఖ్యలో అనుచరులు తరలి వచ్చారు. రౌడీ చర్యలు నశించే దిశగా పాలన రావాలని ప్రజలు ఆకాంక్షించిన విధంగా ఎన్నికలు జరిగయని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. అధికార పక్షాన్ని గద్దె దింపాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు. తన గెలుపు కోసం కృషి చేస్తున్న కార్యకర్తలకు అండగా ఉంటానని, మరొకసారి ఓటర్లు అవకాశం ఇస్తే... మైదకూరు అంటే సామాన్యుడి పాలన అనేలా చేస్తానని స్పష్టం చేశారు.