కడప జిల్లా బ్రహ్మంగారిమఠం పీఠాధిపతి వివాదం నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మఠంలో పనిచేస్తున్న దేవాదాయ శాఖ మేనేజర్ ఈశ్వర్ ఆచారి స్థానంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శంకర్ బాలాజీకి బాధ్యతలు అప్పగించింది. శంకర్ బాలాజీ బ్రహ్మంగారి మఠం వెళ్లి బాధ్యతలు చేపట్టారు. మఠం పర్సన్ ఇన్ఛార్జీగా ఇవాల్టి నుంచి పూర్తి బాధ్యతలు నిర్వహించనున్నారు. మేనేజర్ నుంచి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి నుంచి మఠం పీఠాధిపతి నియమితుల అయ్యే వరకూ శంకర్ బాలాజీ నిర్వహణ బాధ్యతలు చూస్తారు. మేనేజర్ ఈశ్వర్ ఆచారి తాత్కాలిక ఉద్యోగిగా మాత్రమే పని చేయనున్నారు. రేపటి నుంచి బ్రహ్మంగారిమఠంలో భక్తుల దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు శంకర్ బాలాజీ వెల్లడించారు. మేనేజర్ ఈశ్వర్ ఆచారిపై అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
బ్రహ్మంగారిమఠం పర్సన్ ఇన్ఛార్జీగా శంకర్ బాలాజీ బాధ్యతలు
కడప జిల్లా బ్రహ్మంగారిమఠం పర్సన్ ఇన్ఛార్జీగా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శంకర్ బాలాజీ పూర్తి బాధ్యతలు నిర్వహించనున్నారు. మేనేజర్ ఈశ్వర్ ఆచారిపై అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
బ్రహ్మంగారిమఠం పర్సన్ ఇన్చార్జిగా శంకర్ బాలాజీ బాధ్యతలు