ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యం మత్తులో తల్లి, భార్యపై దాడి - assault on mother and wife in jammalamadugu

మద్యం మత్తులో తల్లిని, భార్యను కడతేర్చాలనుకున్నాడో కిరాతకుడు. ఈ ఘటన కడప జిల్లా జమ్మలమడుగులో జరిగింది. దాడిలో తల్లికి తీవ్రగాయాలయ్యాయి. ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

assault-on-mother-and-wife-in-jammalamadugu
మద్యం మత్తులో తల్లి, భార్య పై దాడి

By

Published : Dec 30, 2019, 8:30 PM IST

మద్యం మత్తులో తల్లి, భార్యపై దాడి

మద్యం మత్తులో కన్నతల్లిని, కట్టుకున్న భార్యను అంతమెుందించేందుకు ప్రయత్నించాడో దుర్మార్గుడు. కడప జిల్లా జమ్మలమడుగులో ఈ ఘటన జరిగింది. తాగుడుకి బానిసైన ఆటో డ్రైవర్ బొడ్డు నాగరాజు... ఆదివారం రాత్రి భార్య లక్ష్మిరాధతో గొడవకు దిగాడు. ఇటుకతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. గమనించిన స్థానికులు బాధితురాలిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం లక్ష్మిరాధ నాగరాజుపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

నాగరాజును అరెస్టు చేసిన పోలీసులు మందలించి వదిలేశారు. మరింత కోపోద్రిక్తుడైన నాగరాజు... నాపైనే ఫిర్యాదు చేస్తారా అంటూ... భార్యపై మళ్లీ దాడికి దిగాడు. లక్ష్మిరాధ అక్కడ నుంచి తప్పించుకుంది. అక్కడే ఉన్న తల్లి జయలక్ష్మిపై దాడికి పాల్పడ్డాడు. తల్లిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి: కేశలింగాయపల్లి వద్ద ఢీకొని రెండు ట్రాక్టర్లు బోల్తా

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details