'సౌరఫలకాల ధ్వంసం కేసులో నలుగురు అరెస్ట్' - arrested
కడప జిల్లా రామచంద్రాపురం సోలార్ పరిశ్రమలో ఫలకాలు ధ్వంసం చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 4 గొడ్డళ్లు, 2 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
కడప జిల్లా మైలవరం మండలం సౌరఫలకాల ధ్వంసం కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు నాగార్జున, రమేశ్ సుబ్బారాయుడు, గంగరాజుల నుంచి 4 గొడ్డళ్లు, 2 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. జూన్ 30న రామచంద్రపల్లె సమీపంలో ఉన్న సోలార్ పరిశ్రమలో చొరబడి 17వందల 19 సౌర ఫలకాలను గొడ్డళ్లతో ధ్వంసం చేసినట్లు జమ్మలమడుగు డీఎస్పీ తెలిపారు. గతంలో వీరి భూములను ప్రాజెక్ట్ యాజమాన్యం స్వాధీనం చేసుకుని డబ్బులు చెల్లించకపోవటం... సెక్యూరిటీ గార్డులను విధుల నుంచి తొలగించటం వంటి వాటిని కారణాలుగా చూపిస్తూ... నిందితులు ఈ పనికి ఒడిగట్టినట్లు డీఎస్పీ తెలిపారు.