మున్సిపాలిటీల్లో రెండో డిప్యూటీ మేయర్, ఉపఛైర్మన్ పదవులకు ఆర్డినెన్స్ జారీ కావడంతో.. వైకాపాలోని పలువురు ఆశావాహులు పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నెలఖరులోగా రెండో పదవి కూడా పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తుండగా.. పలువురు పోటీపడుతున్నారు. కడప నగరపాలక సంస్థలో రెండో డిప్యూటీ మేయర్ కోసం సూర్యనారాయణ, నిత్యానందరెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ప్రొద్దుటూరులో రెండో వైస్ ఛైర్మన్‌గా ఎమ్మెల్యే బావమరిది బంగారు మునిరెడ్డి ఉంటాడని భావిస్తున్నారు. పులివెందులలో రెండో వైస్ ఛైర్మన్ పదవి ముస్లిం వర్గానికి ఇవ్వాలని భావిస్తున్నారు. రాయచోటిలో రెండో ఉపఛైర్మన్ పదవి బీసీ వర్గానికి చెందిన వారికి ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జమ్మలమడుగులో ముల్లాజామీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సోమవారం వరకు స్పష్టత వచ్చే అవకాశముంది.
రెండో డిప్యూటీ మేయర్, ఉపఛైర్మన్ పదవులకు ఆశావాహుల పోటీ - ap municipal elections latest news
నగరపాలక సంస్థ, మున్సిపాలిటీల్లో రెండో డిప్యూటీ మేయర్, ఉప ఛైర్మన్ పదవులకు ఆర్డినెన్స్ జారీ కావడంతో... కడప నగరపాలక సంస్థలో పదవుల కోసం వైకాపాలోని పలువురు ఆశావహులు ఆరాట పడుతున్నారు. ఈనెలాఖరులోగా రెండో పదవి కూడా పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తుండగా.. వైకాపాలో ఈ పదవుల కోసం పలువురు పోటీపడుతున్నారు.
రెండో డిప్యూటీ మేయర్, ఉపఛైర్మన్ పదవులకు ఆశావాహుల పోటీ