కడప జిల్లా రైల్వే కోడురు మండలం లక్ష్మీగారిపల్లి.. కొయ్యబొమ్మలకు పెట్టింది పేరు. ఇక్కడి కళాకారులు తయారు చేసే బొమ్మలకు మన రాష్ట్రంతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. తిరుపతి, శ్రీకాళహస్తి దేవాలయ పరిసరాల్లో వీటిని భక్తులు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు.
తమిళనాడు, కర్ణాటకలో ఈ బొమ్మలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. రాజు రాణి బొమ్మలు అక్కడ పెళ్లిళ్లలో ఒకరికి ఒకరు ఇచ్చుకోవడం ఆనవాయితీ. ఇప్పుడు వీటిని అమ్ముకునేందుకు రవాణా సౌకర్యంలేక కళాకారులు ఇబ్బంది పడుతున్నారు. ఉపాధి లేక కష్టాలు అనుభవిస్తున్నారు. రవాణా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.