కరోనాపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు కడప జిల్లా మైదుకూరుకు చెందిన ప్రభాకర్.. చిత్రలేఖనాన్ని ఎంచుకున్నాడు. అది కాగితం మీద కాదు. అలా అని ఇసుకపై వేయలేదు. మార్కెట్ కూడలి రహదారిపై కరోనా చిత్రాన్ని గీశాడు. ఈ వైరస్ దరిచేరకుండా ఉండాల్సిన ఆవశ్యకతను అందరికీ వివరించాడు. 'ఇంట్లోనే ఉందాం కరోనాను తరిమేద్దాం' అంటూ తెలుగు, ఆంగ్ల భాషల్లో సందేశాన్ని ఇచ్చాడు. కరోనా నివారణ దిశగా వెలకట్టలేని కృషి చేస్తున్న వైద్యులకు, పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశాడు.
రహదారిపై చిత్రం.. కరోనాపై సందేశం - boy art corona virus on roads
మైదుకూరు యువకుడు.. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వినూత్నంగా ప్రయత్నించాడు. అందరి ప్రశంసలు అందుకున్నాడు.
![రహదారిపై చిత్రం.. కరోనాపై సందేశం art about corona virus on roads in kadapa district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6594101-922-6594101-1585562218180.jpg)
రహదారిపై కరోనా బొమ్మ