ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెండు నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకోవాలి : ఎస్పీ - కడప జిల్లాలో పోలీసులకు శిక్షణ

కడప జిల్లాలో పోలీసులకు ప్రాథమిక చికిత్స అందించే విధానంపై శిక్షణ శిబిరం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను సమీప ఆస్పత్రులకు వేగంగా తరలిస్తే ప్రాణాలను కాపాడవచ్చునని కడప ఎస్పీ అన్బు రాజన్ స్పష్టం చేశారు.

రెండు నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకోవాలి : ఎస్పీ
రెండు నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకోవాలి : ఎస్పీ

By

Published : Oct 15, 2020, 10:07 PM IST

రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు పోలీసులు బాధితులను సమీపంలోని ఆస్పత్రికిల తరలిస్తే ప్రాణాలను కాపాడవచ్చునని కడప ఎస్పీ అన్బు రాజన్ సూచించారు. కడప పోలీస్ కార్యాలయంలో పోలీసులకు ప్రథమ చికిత్సపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించే విధానం గురించి వివరించారు. ప్రమాదం జరిగిన రెండు నిమిషాల్లోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరకోవాలన్నారు. మూడు నిముషాల లోపు ఆస్పత్రికి తరలిస్తే బ్రతికే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రథమ చికిత్స వల్ల ప్రాణాలను కాపాడవచ్చని పేర్కొన్నారు. దేశంలో రోజుకు సుమారు 1240 మంది చనిపోతున్నారని ఆయన వివరించారు. అత్యధిక మరణాలు రోడ్డు ప్రమాదాల వల్లే జరుగుతున్నాయని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details