కడప జిల్లాలో అతికిరాతంగా భార్యను హత్య చేసిన చిన్నాయపల్లెకు చెందిన నిందితుడు అయ్యలూరి పుల్లారెడ్డిని పోరుమామిళ్ల పోలీసులు అరెస్ట్ చేశారు. భార్య నారాయణమ్మపై అనుమానంతో పథకం ప్రకారమే హత్య చేసి, ఆపై సంచిలో శవాన్ని తీసుకుని పొలంలోని కంప చెట్లలో పారవేశాడని మైదుకూరు డిఎస్పీ విజయకుమార్ సమావేశంలో తెలిపారు.
ఇద్దరు కుమార్తెలకు వివాహమయిందని, కుమారుడు హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నట్లు వివరించారు. భార్యపై అనుమానంతో తరచూ ఘర్షణ పడేవాడని విచారణలో తేలినట్లు తెలిపారు. కుమారుడు వీరమోహన్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోరుమామిళ్ల పోలీసులు నిందితుడైన భర్త పుల్లారెడ్డిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.